ఆసుపత్రిలో ఉరి వేసుకున్న COVID 19 రోగి

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 04:37 AM IST
ఆసుపత్రిలో ఉరి వేసుకున్న COVID 19 రోగి

Updated On : June 19, 2020 / 4:37 AM IST

Indiaలో COVID 19 వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా..2020, జూన్ 19వ తేదీ శుక్రవారం నాటికి 3 లక్షల 80 వేల కేసులు నమోదయ్యాయి. కేసులు అధికమౌతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే..ఇదిలా ఉంటే..కొంతమంది రోగులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. హర్యానాలోని ముల్లన్న పీఎస్ పరిధిలోని కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన 55 ఏళ్ల వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఆసుపత్రిలోనే ఈ ఘటనకు పూనుకోవడంతో అక్కడున్న వారు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియచేశారు. దీంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 10 ఫీట్ల భౌతిక దూరం పాటిస్తూ.. అంత్యక్రియల్లో పాల్గొనాలని అధికారులు సూచించారు. 

 

Read:  పెళ్లింట చావు బాజాలు: రోడ్డు ప్రమాదంలో వధువు, వరుడు మృతి