కామాంధుడు…ఆవుపై అత్యాచారం…అరెస్ట్

కామాంధులకు కళ్లు మూసుకు పోతున్నాయి. ఏమి చేస్తున్నారో స్పృహ కూడా ఉండటంలేదు. మధ్య ప్రదేశ్ లో ఓ కామాంధుడు ఏకంగా ఒక ఆవుతో అసహజ శృంగారం చేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సుందర్ నగర్ లో జూలై 4న ఈ ఘటన జరిగింది.
జూలై 4 తెల్లవారుఝూమున ఓ 55 ఏళ్ల వ్యక్తి సుందర్ నగర్ లోని డైరీ ఫారం లోకి వచ్చాడు. అక్కడ ఉన్న ఆవుపై అసహజ శృంగారం చేశాడు.దీంతో ఆవు తీవ్ర అస్వస్ధతకు గురైంది.
మరునాడు డైరీ ఫారం యజమాని రామ్ యాదవ్.. ఆవులను పరిశీలిస్తుండగా అస్వస్ధతగా ఉన్న ఆవును గమనించాడు. ఆవుకు ఎవరైనా ఏమైనా చేశారా? అన్న అనుమానంతో యజమాని ఆలోచించాడు.
డైరీ ఫామ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా రామ్ యాదవ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు షబ్బీర్ అలీని అదుపులోకి తీసుకున్నారు.
Read Here>>రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి