వామ్మో.. 2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం.. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..
మధ్య ఆసియా దేశాల నుంచి ఈ గ్యాంగ్ కొకైన్ దిగుమతి చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Cocaine Seized (Photo Credit : Google)
Cocaine Seized : ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 560 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌కు చెందిన తుషార్ గోయల్ కింగ్‌పిన్‌గా తేల్చారు పోలీసులు. ఢిల్లీ పోలీస్ విభాగంలోని ‘స్పెషల్ సెల్’ నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. హిమాన్షు, ఔరంగజేబ్ అనే ఇద్దరు వ్యక్తులు తుషార్‌కు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. వారి ముగ్గురి దగ్గర 15 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముగ్గురితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన భరత్ జైన్ ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిపాల్ పూర్ గోడౌన్ నుంచి సరుకును భరత్ జైన్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. మధ్య ఆసియా దేశాల నుంచి ఈ గ్యాంగ్ కొకైన్ దిగుమతి చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మధ్య కాలంలో పట్టుకున్న అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ ఇదే అని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
Also Read : అర్థరాత్రి ప్రయాణాలు చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో…
ఢిల్లీలో నివాసం ఉంటున్న అప్ఘానిస్తాన్ జాతీయులు ఈ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొకైన్ ను నేషనల్ కేపిటల్ రీజియన్ లో విక్రయించేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. డ్రగ్స్ గురించి పక్కా సమాచారం మేరకు స్పెషల్ సెల్ టీమ్ గత రెండు నెలలుగా పని చేస్తోందని, ఈ క్రమంలోనే భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవలే ఇద్దరు ఆఫ్ఘాన్ వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపడింది.
తిలక్ నగర్ లో రైడ్స్ చేయగా ఆ ఇద్దరు పట్టుబడ్డారు. వారి నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరిలో వారిస్ అనే వ్యక్తి 2020 నుంచి శరణార్థిగా భారత్ లో నివాసం ఉంటున్నాడు. అతడి ఫ్యామిలీ మాత్రం ఆఫ్ఘానిస్తాన్ లోనే ఉంది. తొలుత కెమిస్ట్ షాపులో పని చేశాడు. ఆ తర్వాత డ్రగ్స్ బిజినెస్ లోకి దిగాడు. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చే డ్రగ్స్ ను సేకరించడం, వాటిని డెలివరీ చేయడం చేసేవాడు. ఒక్కో డెలివరీకి గాను అతడికి వంద డాలర్లు అందేదని పోలీసులు తెలిపారు.