ఎలా జరిగిందంటే : 6 మిస్సుడు కాల్స్.. రూ.2 కోట్లు కొట్టేశారు

జస్ట్ ఒక్క మిస్సుడు కాల్స్తో. మిస్సుడు కాల్స్ తో మా బ్యాంక్ అకౌంట్లు ఎలా ఖాళీ అవుతాయి.. వెటకారాలు వద్దు అని మనస్సులో అనుకోవచ్చు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. 

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 05:33 AM IST
ఎలా జరిగిందంటే : 6 మిస్సుడు కాల్స్.. రూ.2 కోట్లు కొట్టేశారు

జస్ట్ ఒక్క మిస్సుడు కాల్స్తో. మిస్సుడు కాల్స్ తో మా బ్యాంక్ అకౌంట్లు ఎలా ఖాళీ అవుతాయి.. వెటకారాలు వద్దు అని మనస్సులో అనుకోవచ్చు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. 

స్మార్ట్ ఫోన్.. ఈ వార్త చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎంతో ఫాస్ట్.. మరెంతో వేగంగా సమాచారాన్ని తీసుకుంటారు.. పంపిస్తారు. ఇదే స్మార్ట్ ఫోన్.. మీ జీవితాన్ని తారుమారు చేస్తోంది. జస్ట్ ఒక్క మిస్సుడు కాల్ తో. మిస్సుడు కాల్స్ తో మా బ్యాంక్ అకౌంట్లు ఎలా ఖాళీ అవుతాయి.. వెటకారాలు వద్దు అని మనస్సులో అనుకోవచ్చు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. 

ఏం జరిగింది :
మహీమ్ షా. ముంబైలో వ్యాపారవేత్త. ఆయన ఫోన్ కు 2018, డిసెంబర్ 27-28 తేదీల మధ్య ఇంగ్లాండ్ కోడ్ తో (ప్లస్ 44)తో మిస్సుడు కాల్స్ వచ్చాయి. అది కూడా అర్థరాత్రి సమయంలో. మొత్తం ఆరు మిస్సుడు కాల్స్. ఉదయం నిద్రలేచిన మహీమ్ షా.. ఆ నెంబర్ కు రీ కాల్ చేశారు. వెంటనే సిమ్ కార్డ్ డీ యాక్టివ్ అయ్యింది. వెంటనే తన సర్వీస్ ప్రొవైడర్ కు కాల్ చేశాడు షా. మీరు స్వయంగా రిక్వస్ట్ పెట్టారు.. అందుకే సిమ్ కార్డు బ్లాక్ చేశాం అని వెల్లడించారు. షాక్ అయ్యాడు షా. ఏం జరుగుతుంతో అర్థం కాలేదు. తన ఫోన్ తన దగ్గరే ఉంది.. బ్లాక్ అయ్యింది. అనుమానం వచ్చింది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.

బ్యాంక్ అకౌంట్ ఊడ్చేశారు :
ఆలస్యం చేయకుండా డిసెంబర్ 28వ తేదీ బ్యాంకుకి వెళ్లాడు షా. అకౌంట్లు అన్నీ ఊడ్చేసి ఉన్నాయి. తన బ్యాంక్ ఖాతా నుంచి 28 లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. భారతదేశ వ్యాప్తంగా 14 అకౌంట్లకు కోటి రూపాయల 86 లక్షల బదిలీ అయ్యాయి. బ్యాంక్ అకౌంట్ మొత్తం ఊడ్చేశారు. మినమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచలేదు. వెంటనే బ్యాంక్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులకు కంప్లయింట్ చేశారు. బ్యాంక్, పోలీస్ సైబర్ టీమ్స్.. నగదు బదిలీ జరిగిన 14 అకౌంట్లను గుర్తించారు. డబ్బును వెనక్కి తీసుకురావటానికి ప్రయత్నించారు. కోటి 86 లక్షల్లో కేవలం 20 లక్షలు మాత్రమే తిరిగి రాబట్టారు. మిగతాది గోవిందా.. 
ఎలా జరిగింది :
ప్రతి సిమ్ కార్డుకి యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ను గుర్తించిన హ్యాకర్లు.. యూనిక్ నెంబర్ ఆధారంగా సిమ్ స్వాపింగ్ చేశారు. మహిమ్ షా సిమ్ కార్డు స్వాపింగ్ ద్వారా.. అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, OTPలు, పాస్ వర్డ్స్ అన్నింటిని తెలుసుకున్నారు. యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. మిస్సుడు కాల్స్ ద్వారా రిటర్న్ కాల్ వచ్చే విధంగా చేయగలిగారు. అలా చేసిన వెంటనే అతని సిమ్ కార్డ్, ఫోన్ లోని డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయింది. హ్యాకర్లే స్వయంగా సర్వీస్ ప్రొవైడర్లకు కాల్ చేసి.. సిమ్ కార్డు బ్లాక్ చేయించారు. అతనికి ఉన్న అన్ని మార్గాలను కట్ చేశారు. వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును.. ఆన్ లైన్ ద్వారా ట్రాన్సఫర్ చేసుకున్నారు. ఇదీ జరిగింది.
కేసులు నమోదు :
బాధితుడు షాతోపాటు బ్యాంక్ అధికారుల కంప్లయింట్స్ తో కేసు నమోదు చేసింది BKC సైబర్ క్రైం పోలీస్ స్టేషన్. విచారణ చేస్తున్నారు.