Boat Accident In Nigeria : నైజీరియాలో ఘోర ప్రమాదం.. నైగర్‌ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్‌ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి అయ్యారు. మరి కొంతమంది గల్లంతయ్యారు. నైగర్‌ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది.

Boat Accident In Nigeria : నైజీరియాలో ఘోర ప్రమాదం.. నైగర్‌ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి

Boat accident in Nigeria

Updated On : October 10, 2022 / 9:18 AM IST

Boat Accident In Nigeria : నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్‌ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి అయ్యారు. నైగర్‌ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న 76 మంది మృతి చెందారు. మరి కొంతమంది గల్లంతయ్యారు.

ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 76 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షులు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు.

Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!

మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవలోని ప్రతిఒక్కరి ఆచూకీ లభించేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.