Married Woman Suicide : ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులు తాళలేక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజా బొల్లారం తండాకు చెందిన 35 ఏళ్ల సునీత...ఇన్‌స్టాఫండ్‌ ఫైనాన్స్‌ వేధింపులను తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లిన పిల్లలు...తల్లి విగతజీవిగా కనిపించడంతో గుండెలివిసేలా రోదిస్తున్నారు.

Married Woman Suicide : ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Married Woman Suicide

Updated On : August 26, 2022 / 9:51 PM IST

Married Woman Suicide : ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులు తాళలేక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజా బొల్లారం తండాకు చెందిన 35 ఏళ్ల సునీత…ఇన్‌స్టాఫండ్‌ ఫైనాన్స్‌ వేధింపులను తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లిన పిల్లలు…తల్లి విగతజీవిగా కనిపించడంతో గుండెలివిసేలా రోదిస్తున్నారు.

అలీయాబాదాలో శ్రీలక్ష్మి బైక్‌ జోన్‌ నిర్వాహకురాలు సునీత ఆత్మహత్యపై మేడ్చల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాఫండ్‌ ఫైనాన్స్‌ మెసేజ్‌లను పరిశీలించారు. సునీత పనిచేస్తున్న శ్రీలక్ష్మి బైక్‌ జోన్‌ బ్రాంచ్‌లో కొన్ని అక్రమాలున్నాయి…మీ చెల్లింపులను ఒకసారి చెక్‌ చేసుకోండి..అంటూ ఇన్‌స్టాఫండ్ ఫైనాన్స్‌ పేరు …వాట్సప్‌ స్టేటస్‌లో ఉండడాన్ని గమనించారు.

Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త

ఇన్‌స్టాఫండ్‌ వేధింపులపై పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాఫండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తాళలేక సునీత ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.