Married Woman Suicide : భర్త పుట్టింటికి పంపించడంలేదని వివాహిత ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం నెలకొంది. అత్తింటివాళ్లు పుట్టింటికి పంపడం లేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాను పుట్టింటికి వెళ్తానని భర్తకు అడిగింది.. దానికి భర్త నిరాకరించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Married Woman Suicide
Married Woman Suicide : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం నెలకొంది. అత్తింటివాళ్లు పుట్టింటికి పంపడం లేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాను పుట్టింటికి వెళ్తానని భర్తకు అడిగింది.. దానికి భర్త నిరాకరించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శివరాంపల్లిలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన స్వప్నకు.. శివరాంపల్లికి చెందిన సిద్ధూ సింగ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే తాను పుట్టింటికి వెళ్తానని స్వప్న భర్తను అడిగింది. ఇప్పుడు వద్దని.. కొన్ని రోజుల తర్వాత వెళ్లు.. అని భర్త చెప్పడంతో అతనితో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది.
Married Woman Suicide : హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న.. భర్త సిద్ధూ తనను పుట్టింటికి పంపించేందుకు నిరాకరించాడన్న బాధతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.