Family Planning Operation Fail Woman Died : మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్..పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో మహిళ మృతి

హైదరాబాద్ పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మహిళ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలివేలు చనిపోయారని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Family Planning Operation Fail Woman Died : మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్..పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో మహిళ మృతి

family planning operation fail woman died (2)

Updated On : September 8, 2022 / 3:46 PM IST

family planning operation fail woman died : రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ కావడంతో వరుసగా మహిళలు చనిపోతున్నారు. ఇబ్రహీంపట్నంలో కుబుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అయి ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మరో మహిళ మృతి చెందారు. హైదరాబాద్ పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం జరిగింది.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మహిళ మృతి చెందారు. ఈ నెల 4వ తేదీన అలివేలు(25) అనే గర్భిణి డెలివరీ కోసం పేట్ల బురుజు మెటర్నటీ ఆస్పత్రిలో చేరారు. మహిళకు సి సెక్షన్ తో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన మర్నాటి నుంచి మహిళకు ఫీవర్, వాంతులు, విరోచనాలు కల్గుతున్నాయి. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది.

Operations Fail Three Women Died : ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం..కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్, ముగ్గురు మహిళలు మృతి

దీంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం నిన్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె మృతి చెందారు. అలివేలు మరణానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలివేలు చనిపోయారని కుటుంబసభ్యులు అంటున్నారు.