జీతం సరిపోలేదేమో : ఆర్మీ అధికారినే లంచం అడిగి దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ(ghmc) కార్యాలయం దగ్గర లంచం తీసుకుంటూ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్(tax inspector) జగన్

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 01:49 PM IST
జీతం సరిపోలేదేమో : ఆర్మీ అధికారినే లంచం అడిగి దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

Updated On : January 31, 2020 / 1:49 PM IST

ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ(ghmc) కార్యాలయం దగ్గర లంచం తీసుకుంటూ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్(tax inspector) జగన్

ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ(ghmc) కార్యాలయం దగ్గర లంచం తీసుకుంటూ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్(tax inspector) జగన్ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటి పనులకు సంబంధించిన మ్యుటేషన్ కోసం రూ.75వేలు లంచం(bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శుక్రవారం(జనవరి 31,2020) ఏసీబీ అధికారులు ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ కార్యాయలంలో సోదాలు నిర్వహించారు. ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ ఆఫీస్ లో ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న జగన్.. రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటి పత్రాలకు సంబంధించి రూ.75వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆర్మీ మాజీ అధికారి ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. వారు చెప్పినట్టు డబ్బు తీసుకుని ఆయన వెళ్లారు. ఖైరతాబాద్ సర్కిల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గణాంక భవన్ దగ్గర లంచం డబ్బు తీసుకుంటూ జగన్ పట్టుబడ్డారు. జగన్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేశారు. అలాగే జగన్ ఇంట్లోనూ సోదాలు చేశారు.

ఉద్యోగులకు ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తుంది. కొందరికి భారీ మొత్తంలోనే జీతాలు అందుతాయి. అయినా కొందరు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. లంచం డిమాండ్ చేస్తున్నారు. లంచం ఇవ్వనిదే పని కావడం లేదు. లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని కొందరు లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ధైర్యంగా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. అవినీతి అధికారులను కటకటాల్లోకి పంపిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరం.

లంచం తీసుకునే అధికారులను కట్టడి చేసేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తున్నారు. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. యథేచ్చగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. చేయి తడపనిదే పని చెయ్యడం లేదు.