Shobitha Shivanna Case : డెత్ మిస్టరీ..! నటి శోభిత బలవన్మరణం కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వారి స్టేట్ మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేశారు.

Actress Shobitha (Photo Credit : Google)
Shobitha Shivanna Case : కన్నడ నటి శోభిత బలవన్మరణం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోసుమార్టం పూర్తి చేసిన వైద్యులు.. శోభిత బలవన్మరణం చేసుకున్నట్లు నిర్ధారించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శోభిత కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇక, శోభిత డెడ్ బాడీని కర్నాటకకు తరలిస్తున్నారు. అలాగే మరోవైపు కన్నడ సీరియల్ నటి శోభిత కేసులో దర్యాఫ్తును వేగవంతం చేశారు పోలీసులు. శోభిత నివాసంలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డు ఇట్ అంటూ నోట్ లో రాసి ఉన్నట్లు సమాచారం. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ రాసింది అనేది మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వారి స్టేట్ మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటివరకు భార్యభర్తల మధ్య ఎలాంటి విబేధాలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. డిప్రెషన్ లో బలవన్మరణం చేసుకుందా? లేక ఇతర కారణాలతో శోభిత ఇలా చేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సుధీర్ రెడ్డితో వివాహం తర్వాత శోభిత సీరియల్స్ లో నటించడం మానేశారు. అటు, బలవన్మరణానికి ముందు శోభిత ఎవరెవరితో మాట్లాడింది? అనేదానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
అటు నటి శోభిత ఘటనపై ఆమె మామ స్పందించారు. ”శోభితను కన్నబిడ్డలా చూసుకున్నాం. మాతో బాగా కలిసిపోయింది. నా కుమారుడు సుధీర్ తో అన్యోన్యంగా ఉంది. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇలా జరగడం దురదృష్టకరం” అని ఆయన వాపోయారు.
కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో బలవన్మరణం చేసుకున్నారు. కర్నాటకలోని సక్లేశ్ పూర్ కు చెందిన శోభిత బ్రహ్మగంటు సహా పలు సీరియల్స్ లో నటించారు. 2023లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత యాక్టింగ్ కు విరామం ఇచ్చి భర్తతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
Also Read : ప్రేమ వ్యవహారమా? పని ఒత్తిడా? కలకలం రేపుతున్న వాజేడు ఎస్ఐ బలవన్మరణం..