Visakha Honey Trap Case : విశాఖ హనీట్రాప్ కేసులో మరో సంచలనం.. తెరపైకి ఏపీ బీజేపీ యువనేత..!
జెమీమాతో బీజేపీ యువ నేత జరిపిన సంభాషణ వింటే.. మతి పోవాల్సిందే.

Visakha Honey Trap Case : అందాన్ని ఎరవేసి కోట్లు కొల్లగొట్టిన కిలేడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందచందాలను మగాళ్లకు ఎరవేసి బుట్టలో వేసుకుని బ్లాక్ మెయిల్ తో కోట్లకు కోట్లు కొల్లగొట్టిన జాయ్ జెమీమా కథలు కోకొల్లలు. సమాజంలో పలుకుబడి ఉన్న సంపన్నులను లక్ష్యంగా చేసుకుని వారిపై వలపు వల విసిరి మాయతో మత్తులోకి దించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంది.
ఏపీలో సంచలనం రేపిన విశాఖ హనీట్రాప్ కేసులో కొత్త క్యారెక్టర్ లు బయటకు వస్తున్నాయి. హనీట్రాప్ తో కోట్లు కొల్లగొట్టిన జాయ్ జెమీమా వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు స్కెచ్ లు వేస్తూ మగాళ్లను ఈజీగా మోసం చేసిన జెమీమా నెట్ వర్క్ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. తాజాగా జాయ్ జెమీమా వెనక నుండి నడిపిస్తున్న ఓ బీజేపీ యువ నాయకుడిని గుర్తించారు. బీజేపీ యువ నేత అవినాశ్ బెంజిమెన్ జాయ్ జెమీమాతో జరిపిన సంభాషణ వింటే.. మతి పోవాల్సిందే.
హనీట్రాప్ కేసు మెల్ల మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది. హనీట్రాప్ కేసులో జాయ్ జెమీమా క్యారెక్టర్ పై పాజిటివ్ గా మాట్లాడారు మాజీ ఎంపీ హర్షకుమార్. బాధితుల వద్ద నుంచి సీపీ డబ్బులు తీసుకుని ఆమెను ఇరికించారని ఆరోపించారు. తాజాగా ఈ హనీ ట్రాప్ వెనక ఏపీ బీజేపీ యువనేత ఉన్నట్లు తెలుస్తోంది. జాయ్ జెమీమాతో బీజేపీ యువ నాయకుడు అవినాశ్ ఫోన్ సంభాషణలు లీక్ అయ్యాయి. అలాగే జెమీమాతో అవినాశ్ కలిసున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : వామ్మో.. 56 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం.. కామారెడ్డి జిల్లాలో దొంగ నోట్ల కలకలం..