Fake Currency : వామ్మో.. 56 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం..

తెలంగాణ, రాజస్తాన్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

Fake Currency : వామ్మో.. 56 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం..

Updated On : December 15, 2024 / 2:01 AM IST

Fake Currency : కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం చెలరేగింది. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్టు దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు.

వెంటనే పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి దగ్గర చెక్ చేయగా నకిలీ కరెన్సీ వ్యవహారం బయటపడింది. వారి నుంచి పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నకిలీ కరెన్సీ విలువ 30 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. తెలంగాణ, రాజస్తాన్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

దొంగ నోట్లు ముద్రించడమే కాదు వాటిని చెలామణి చేస్తున్న ఆరుగురు వ్యక్తులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మొత్తం 8 మంది సభ్యుల గల ఈ ముఠా తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, ఉత్తరాఖండ్ కు చెందిన వ్యక్తులు. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో దొంగ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. నకిలీ నోట్లను గ్రామీణ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్నారు.

ఇటువంటి ముఠా ఇప్పటివరకు దాదాపు 60లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను చెలామణి చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగ నోట్లను కేవలం కామారెడ్డి జిల్లాకు మాత్రమే తరలించారా? ఇతర జిల్లాలకు కూడా తరలించారా? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డి పోలీసులు 56 లక్షల 90వేల రూపాయలు విలువ చేసే రూ.500 నోట్లను సీజ్ చేశారు.

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?