రేవ్ పార్టీ భగ్నం : 200మంది అబ్బాయిలు, అమ్మాయిలు అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 01:49 PM IST
రేవ్ పార్టీ భగ్నం : 200మంది అబ్బాయిలు, అమ్మాయిలు అరెస్ట్

Updated On : May 5, 2019 / 1:49 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. నోయిడాలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రైడ్ చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. 200మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 161మంది అబ్బాయిలు, 31మంది అమ్మాయిలు ఉన్నారు. శనివారం అర్థరాత్రి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఢిల్లీకి చెందిన వారే. కొంతమంది హర్యానా, కొంతమంది నోయిడాకి చెందిన వారు ఉన్నారు.

31 హుక్కాలు, 112 బీర్ బాటిళ్లు, 30 లిక్కర్ బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన అమిత్ త్యాగి, పంకజ్ శర్మ, అద్నన్ అహ్మద్, బాలేష్ కోహ్లి ఈ రేవ్ పార్టీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రేవ్ పార్టీ పేరుతో యువత హద్దులు మీరుతోంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఫుల్లుగా మందు తాగుతారు. మద్యం మత్తులో అసభ్యకరమైన డ్యాన్సులతో రెచ్చిపోతారు. రేవ్ పార్టీల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధం. వీటికి పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. అయినా.. కొందరు గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.