టీనేజీ పిల్లలకు ’సైబర్’ పాఠాలు
సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు.

సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ : సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. టీనేజీ పిల్లలకు సైబర్ పాఠాలు నేర్పేందుకు సిద్ధమయ్యారు. సైబర్ నేరాల నియంత్రణ, స్మార్ట్ ఫోన్స్ లోని యాప్స్ దుష్ప్రభావంపై అవగాహన కల్పించేందుకు రెడీ అయ్యారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో, ప్రత్యేకంగా టీనేజీ పిల్లల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. టెక్నాలజీ తప్పనిసరి అంటూ తల్లిండ్రులు సైతం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. దీంతో పిల్లలు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం హోం శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం గుర్తించింది. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న 10 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోర్న్ సైట్లు, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఆందోళనకర పరిణామమని పేర్కొంది. దీంతో అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు సైబర్ నేరాల నియంత్రణపై తప్పనిసరిగా టీనేజీ విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాటి నియంత్రణకు ఎలా వ్యవహరించాలన్న అంశాలతోపాటు స్మార్ట్ ఫోన్లలో విపరీతంగా అంబుబాటులో ఉన్న యాప్స్ దుష్ప్రభావంపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇందులో భాగంగా ’స్మార్ట్ ఫోన్స్-సైబర్ నేరాలు’ అన్న అంశంపై ప్రత్యేకంగా 7, 8, 9, 10 వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని సూచించింది. ఈమేరకు రాష్ట్ర పోలీస్ శాఖ సైతం సీఐడీ ద్వారా పాఠ్యాంశం రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నాలుగు తరగతుల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన, నియంత్రణకు సంబంధించి ఒక పాఠ్యాంశం చేర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
మార్కెట్ లో వేలకొద్ది యాప్స్ అందుబాటులోకి రావడంతో టీనేజ్ విద్యార్థులు ఏది పడితే ఆ యాప్ ను వినియోగించకుండా ఉండేందుకు ’గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ అనే పేరుతో ప్రత్యేకంగా చైతన్యం కలిగించనున్నారు. ఆ యాప్ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని ప్రాక్టికల్ గా చెప్పేందుకు కృషి చేస్తున్నామని, దీని వల్ల యువత చెడుదారి పట్టకుండా ఉంటారని సీఐడీలోని పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.