ఎంత ధైర్యం : బాలకృష్ణ భార్య సంతకం ఫోర్జరీ చేసిన బ్యాంక్‌ అకౌంటెంట్‌

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని HDFC బ్యాంక్‌ అకౌంటెంట్‌ ఫోర్జరీ చేశాడు. బంజారాహిల్స్‌లోని HDFC బ్యాంక్‌

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 03:44 AM IST
ఎంత ధైర్యం : బాలకృష్ణ భార్య సంతకం ఫోర్జరీ చేసిన బ్యాంక్‌ అకౌంటెంట్‌

Updated On : February 17, 2020 / 3:44 AM IST

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని HDFC బ్యాంక్‌ అకౌంటెంట్‌ ఫోర్జరీ చేశాడు. బంజారాహిల్స్‌లోని HDFC బ్యాంక్‌

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని HDFC బ్యాంక్‌ అకౌంటెంట్‌ ఫోర్జరీ చేశాడు. బంజారాహిల్స్‌లోని HDFC బ్యాంక్‌ బ్రాంచ్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం వసుంధర సంతకాన్ని అకౌంటెంట్‌ కొర్రి శివ ఫోర్జరీ చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లోని HDFC బ్యాంక్‌ బంజారాహిల్స్‌ బ్రాంచ్‌ మేనేజర్లు ఫణింద్ర, శ్రీనివాస్‌ ఫిబ్రవరి 13న ఆమె ప్రతినిధి సుబ్బారావుకు ఫోన్‌ చేసి వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె అకౌంట్‌ నంబర్‌ కూడా చెప్పి అకౌంట్‌ను యాక్టివేట్‌ చేయమంటారా అని ప్రశ్నించారు. తాము మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని చెబుతూ ఈ విషయాన్ని వసుంధర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కూడా తాను ఎలాంటి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

బ్యాంకు అధికారులు విచారించగా.. కొత్తగా వచ్చిన అకౌంటెంట్‌ కొర్రి శివ ఇటీవల వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇచ్చినట్లుగా తేలింది. దీనిపై శివను నిలదీయగా మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తు చేసినట్లుగా అంగీకరించాడు. కొర్రి శివపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More>>ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం