West Bengal : ఫైనల్‌లో టీమ్ఇండియా ఓటమి.. ఆత్మహత్య చేసుకున్న 23 ఏళ్ల యువకుడు..!
West Bengal Man lost his life : భారత ఓటమిని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహ్యతకు పాల్పడ్డాడు.

West Bengal Man lost his life
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతీయులకు నిరాశనే మిగిల్చింది. ఈ మెగాటోర్నీలో వరుసగా 10 మ్యాచుల్లో గెలిచి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. ఈ క్రమంలో కోట్లాది మంది టీమ్ఇండియా అభిమానుల గుండెలు బద్దలు అయ్యాయి. 12 ఏళ్ల తరువాత కప్పును ముద్దాడాలని భావించినప్పటికీ ఆ కల నెరవేరకపోవడంతో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశకు లోనైంది. ఈ ఓటమిని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహ్యతకు పాల్పడ్డాడు.
వివరాలు ఇలా ఉన్నాయి.. రాహుల్ లోహర్ అనే 23 ఏళ్ల వ్యక్తి బంకురా జిల్లాలోని బెలిటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. అతడు నగరంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. అతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండడంతో సెలవు తీసుకున్నాడు. ఇంట్లోనే మ్యాచ్ చూశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. తీవ్ర మనస్తాపానికి చెందిన రాహుల్ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Mumbai : లిప్ స్టిక్ ఆర్డర్ చేసిన మహిళా డాక్టర్ .. అడ్డంగా దోచేసిన కేటుగాళ్లు..
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరన్నారు. అలాగని అతడికి ఎలాంటి సమస్యలు లేవన్నారు.