Illegal Affair : తండ్రి వివాహేతర సంబంధం..నిలదీసిన కుమారుడు…!

తాళి కట్టిన భార్య, కన్న కొడుకు ఎదుటే తన ప్రియురాలితో సరసాలాడుతున్నాడో వ్యక్తి. తండ్రిని పధ్ధతి మార్చుకోవాలని చెప్పిన కొడుకును హత్యచేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Illegal Affair : తండ్రి వివాహేతర సంబంధం..నిలదీసిన కుమారుడు…!

Illegal Affair

Updated On : September 14, 2021 / 5:37 PM IST

Illegal Affair : తాళి కట్టిన భార్య, కన్న కొడుకు ఎదుటే తన ప్రియురాలితో సరసాలాడుతున్నాడో వ్యక్తి.  తండ్రిని పధ్ధతి మార్చుకోవాలని చెప్పిన కొడుకును హత్యచేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. చేసిన హత్య కప్పిపుచ్చుకునేందుకు తన కుమారుడు కనిపించటం లేదని కట్టు కధలు అల్లాడు. పోలీసు విచారణలో నిజం బయటపడింది.

బెంగుళూరులోని గురప్పనపాల్యకు చెందిన సునీల్ కుమార్(30)కు స్ధానికంగా ఉన్న మహిళతో వివాహం అయ్యింది.  వారికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సునీల్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా అతని భార్య స్ధానికంగా ఉన్న ఒక బట్టల షాపులో పని చేస్తోంది. సునీల్ కుమార్ తన భార్య పని చేసే బట్టల షాపులోని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి భర్తను వారించింది.
Read Also : Singareni Colony Rape Case : సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు నిందితుడు అరెస్ట్ ?
వివాహేతర సంబంధం మానుకోవాలని చాలాసార్లు నచ్చచెప్పింది. అయినా సునీల్ వినలేదు. ఏకంగా ప్రియురాలిని ఇంటికితీసుకు రావటం మొదలెట్టాడు. భార్య, కొడుకు ముందు సరసాలాడేవాడు. అదే క్రమంలో ఆగస్ట్ నెలలో  ప్రియురాలిని ఇంటికి తీసుకు వచ్చి కొడుకు ముందు సరసాలాడసాగాడు. తండ్రి ప్రవర్తన నచ్చని కొడుకు తండ్రిని ఎదిరించాడు. ఇదేం పధ్ధతని ప్రశ్నించాడు.

అప్పటికే భార్య వారి సంబంధాన్ని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కొడుకు కూడా వ్యతిరేకించే సరికి కోపంతో రగిలిపోయాడు. సమీపంలోని మారణాయుధం తీసుకుని కొడుకును హత్య చేశాడు. బయటకు వెళ్లిన భార్య తిరిగి వచ్చేసరికి కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లి భోరున విలపించింది. ఆ సమయంలో భార్య దగ్గరకు వచ్చిన సునీల్…ప్రియురాలిని వదిలేస్తాను…. కొడుకు మృతదేహాన్ని ఖననం  చేసేందుకు సహకరించాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది.

దీంతో భార్య,ప్రియురాలితో కలిసి మృతదేహాన్ని తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పూడ్చి పెట్టారు.  ఇంటికి తిరిగివచ్చి ఏమీ తెలియనట్లు జీవించసాగారు. కొన్నాళ్లకు మీ పిల్లాడు కనిపించటంలేదు… ఎక్కడికి వెళ్లాడు… ఏమైంది అంటూ ఇతర కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు అడగటం మొదలెట్టేసరికి భార్యా భర్తలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు.
Read Also : TikTok Couple : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్…రూ.44 లక్షల కుచ్చు టోపి పెట్టిన దంపతులు
దీంతో ఆగస్ట్ 26న సునీల్ స్ధానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి తమ కుమారుడు ఈ ఏడాది ఫిబ్రవరి7న అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సునీల్ నే ప్రశ్నించారు.

పిబ్రవరి 7నుంచి కనిపించకుండా పోతే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు ఆలస్యం చేశారు ? అంటూ అడిగారు. విచారణలో సునీల్ వివాహేతర సంబంధం బయట పడింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం ఒప్పుకున్నాడు. తానే కుమారుడిని హత్య చేశానని ఖననం చేసేందుకు భార్య, ప్రయురాలి సహకారం తీసుకున్నానని సునీల్ అంగీకరించాడు.