డెలివరీ కోసం వెళ్తే : గర్భసంచిలోనే శిశువు తల!
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళ బిడ్డను కోల్పోయింది. ఆస్పత్రిలో డెలివరీ సమయంలో నర్సుల నిర్లక్ష్యానికి గర్భసంచిలో నుంచి శిశువు మెండెం తెగి వచ్చింది. తల మాత్రం అందులోనే ఉండిపోయింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళ బిడ్డను కోల్పోయింది. ఆస్పత్రిలో డెలివరీ సమయంలో నర్సుల నిర్లక్ష్యానికి గర్భసంచిలో నుంచి శిశువు మెండెం తెగి వచ్చింది. తల మాత్రం అందులోనే ఉండిపోయింది.
రామ్ గఢ్: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళ బిడ్డను కోల్పోయింది. ఆస్పత్రిలో డెలివరీ సమయంలో నర్సుల నిర్లక్ష్యానికి గర్భసంచిలో నుంచి శిశువు మెండెం తెగి వచ్చింది. తల మాత్రం అందులోనే ఉండిపోయింది. ఈ వారమే రామ్ గడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నర్సులు ప్రయత్నించి సస్పెండ్ అయ్యారు. అసలేం జరిగిదంటే.. రామ్ గఢ్ కు చెందిన మహిళ ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. డెలివరీ సమయంలో కాన్పు కాస్త కష్టంగా మారింది. గర్భసంచిలో శిశువును బయటకు తీసే క్రమంలో ఇద్దరు నర్సులు పైశాచికంగా ప్రవర్తించారు. శిశువును అమాంతం గట్టిగా బయటకు లాగడంతో గర్భసంచిలో శిశువు తల ఉండిపోయింది. కేవలం పసికందు మొండెం మాత్రమే బయటకు వచ్చింది. ఆ విషయం బయటకు పొక్క కుండా ఉండేందుకు శిశువు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మహిళ గర్భాశయంలోనే శిశువు తల ఉండిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా మెరుగైన చికిత్స అవసరమంటూ కుటుంబ సభ్యులను నమ్మించి జోదాపూర్ లోని ఉమైద్ ఆస్పత్రికి తరలించారు.
షాకైన వైద్య బృందం.. మహిళా బంధువులకు సమాచారం
ముందుగానే అక్కడి డాక్టర్ కు ఫోన్ చేసి.. మహిళ పేషెంట్ కు డెలివరీ పూర్తి చేశామని, ఆమె గర్భసంచిలో మాయ ఉండి పోయిందని చెప్పారు. దీంతో డాక్టర్ల బృందం మహిళ గర్భసంచిలో మాయను తీసేందుకు ఆపరేషన్ చేయగా.. అందులో మాయతో పాటు శిశువు తల ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే మహిళ బంధువులకు సమాచారం అందించారు. వారు వెంటనే రాంగడ్ ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సు, డాక్టర్ పై చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు.. నర్సు, డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ నిఖిల్ శర్మను పిలవకుండా డెలివరీ చేసినందును ఆయన పోస్టింగ్ ను మాత్రం పెండింగ్ లో పెట్టినట్టు చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ బీఎల్ బంకర్ వెల్లడించారు. వారంలోగా ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం డెలివరీ అయిన మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.