Andhra Pradesh : బాబాయ్ చెవి ఊడేలా కొరికేసిన అబ్బాయ్

కుటుంబంలో జరిగిన గొడవల్లో  బాబాయ్ చెవిని అబ్బాయ్ కొరికేశాడు. అది ఏదో పంటి గాట్లు పడేట్టు కాదు.... చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Andhra Pradesh : బాబాయ్ చెవి ఊడేలా కొరికేసిన అబ్బాయ్

Bapatla Ear Cuting

Updated On : July 31, 2022 / 7:12 PM IST

Andhra Pradesh :  కుటుంబంలో జరిగిన గొడవల్లో  బాబాయ్ చెవిని అబ్బాయ్ కొరికేశాడు. అది ఏదో పంటి గాట్లు పడేట్టు కాదు…. చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో ఒక కుటుంబంలో తల్లికి చిన్నకొడుక్కి మధ్య మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని ఆమె తన పెద్ద కొడుక్కి చెప్పింది. దీంతో అన్న వచ్చి  తల్లితో గొడవపడిన విషయమై  తమ్ముడిని మందలించాడు.  అది భరించలేని తమ్ముడు కోపంతో ఊగిపోతూ అన్నను కొట్టాడు.  ఈక్రమంలో ఇంట్లో అందరూ కలిసి వారిద్దరూ కొట్టుకోకుండా ఆపేందుకు చిన్న కొడుకును గట్టిగా పట్టుకున్నారు.

ఇంతలో అన్న కొడుకు  వచ్చి బాబాయ్ చెవి  కొరికాడు. అలా కొరికే క్రమంలో చెవి శరీరం నుంచి విడిపోయి బయటకు  వచ్చేసింది. దీంతో లబోదిబోమంటూ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఊడిపడిన సగం చెవితో ఆ వ్యక్తిని  తెనాలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు  ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం బాధితుడిని గుంటూరు ప్రభుత్వ  వైద్యశాలకు తరలించారు.  ఈఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.