ఘోర బస్సు ప్రమాదం : 12మంది మృతి
నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.

నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురి గాయలయ్యాయి. ఈ ఘటన సింధుపాల్ చోక్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
2019, నవంబర్ 27న నేపాల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టిన ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. నేపాల్ లోని అర్ఘకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి బయలుదేరిన బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది.