Married Woman Live In Relation: భర్త అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని భార్య ఏం చేసిందంటే…షాకింగ్

భర్త ఉండగానే భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వింత ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చింది.జిమ్ ట్రైనర్ అయిన భర్తతో పాటు పదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని విడిచి పెట్టి వెళ్లి, వేరే వ్యక్తితో ఫరీదాబాద్‌లో సహజీవనం చేస్తున్న భార్య ఘటన హైకోర్టు విచారణతో తాజాగా వెలుగుచూసింది....

Married Woman Live In Relation: భర్త అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని భార్య ఏం చేసిందంటే…షాకింగ్

భర్తను వదిలి వేరే వ్యక్తితో భార్య సహజీవనం...

Updated On : June 20, 2023 / 5:12 AM IST

Married Woman Have Live In Relation With Other Man: భర్త ఉండగానే భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వింత ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చింది.జిమ్ ట్రైనర్ అయిన భర్తతో పాటు పదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని విడిచి పెట్టి వెళ్లి, వేరే వ్యక్తితో ఫరీదాబాద్‌లో సహజీవనం చేస్తున్న భార్య ఘటన హైకోర్టు విచారణతో తాజాగా వెలుగుచూసింది.(Live In Relation)

Rajasthan Cyclone Biparjoy: అతి భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదలు, ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరానికి చెందిన జిమ్ ట్రైనర్ తన భార్య తప్పిపోయిందని ఉత్తరాఖండ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సదరు వివాహితను హైకోర్టు ముందు హాజరు పర్చాలని జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్‌లతో కూడిన హైకోర్టు డివిజన్( Uttarakhand High Court) బెంచ్ డెహ్రాడూన్,ఫరీదాబాద్‌లోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. దీంతో ఆ మహిళ హైకోర్టుకు వచ్చి తన ఇష్టానుసారమే తాను ఫరీదాబాద్‌ లివింగ్ పార్ట్‌నరుతో (live-in partner)వెళ్లినట్లు తెలిపింది.

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 7లక్షల మందికి ప్రయోజనం

విచారణ సందర్భంగా జిమ్ ట్రైనర్ అయిన తన భర్త తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇప్పుడు అతడితో కలిసి జీవించడం ఇష్టం లేదని కోర్టుకు తెలిపింది.దీంతో తాను ఇష్టానుసారం వేరే వ్యక్తితో వెళ్లానని 37 ఏళ్ల మహిళ హైకోర్టుకు తెలిపింది. 2022వ సంవత్సరం ఆగస్టు 7వతేదీన తాను భర్త, పిల్లల్ని విడిచిపెట్టి, అప్పటి నుంచి ఫరీదాబాద్ వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నానని భార్య చెప్పింది. దీంతో భర్తను వదిలి తనకు ఇష్టమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం అనుమతినిచ్చింది.భర్త ఉండగానే మరో వ్యక్తితో సహజీవనం చేసేందుకు హైకోర్టు అనుమంతించిన ఘటన సంచలనం రేపింది.ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.