Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 7లక్షల మందికి ప్రయోజనం
Telangana : ఈ నిర్ణయంతో సర్కార్ పై ఏడాదికి సుమారు 974 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈ మేరకు హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Telangana Government Employees
Telangana Government Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ(Dearness Allowance), డీఆర్(Dearness Relief) విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక తీసుకుంది. జూన్ నుంచి పెంచిన డీఏ, డీఆర్ అమల్లోకి వస్తుంది. జూలై వేతనంతో డీఏ, డీఆర్ ను ప్రభుత్వం చెల్లించనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నిర్ణయంతో సర్కార్ పై ఏడాదికి సుమారు 974 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఈ మేరకు హరీశ్ రావు ట్వీట్ చేశారు.
”తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తున్నాం. 2.73శాతం డీఏ పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి నెల నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. జూన్ నెల వేతనంలో పెంచిన డీఏ ఖాతాల్లో పడనుంది. ఈ నిర్ణయంతో 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది కలగనుంది” అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను పెంచడానికి (జిఓ ఎంఎస్ 51)ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జిఓ ఎంఎస్ 50) జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) బేసిక్ పేలో 20.02 శాతం నుంచి బేసిక్ పేలో 22.75 శాతానికి సవరించబడింది. ఇది జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది. రివైజ్డ్ పే స్కేల్స్, 2015లో వేతనాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే బేసిక్ పేలో 55.536 శాతం నుంచి 59.196 శాతానికి సవరించబడింది.