అసభ్యకర వీడియోతో సినీ నటిని బెదిరిస్తున్న కాలేజీ యజమాని

అసభ్యకర వీడియోతో సినీ నటిని బెదిరిస్తున్న కాలేజీ యజమాని

Updated On : February 22, 2021 / 6:45 PM IST

Chennai college owner threaten actress : మత్తు మందు కలిపిని కూల్ డ్రింక్ ఇచ్చి తనతో అసభ్యకర దృశ్యాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ కాలేజీ యజమాని నుంచి రక్షించాలని చెన్నై కు చెందిన ఒక నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చెన్నై నగర శివారులో కాలేజీలు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి తమిళ్ సినిమాల్లో నటించిన నటితో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు గాను ఆ సినిమా విషయమై చర్చించేందుకు తన ఆఫీసుకు ఆమెను ఆహ్వానించాడు.

అతని ఆఫీసుకు వెళ్లగా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారని…ఆమె స్పృహ తప్పిన తర్వాత, అసభ్యకరంగా ఆమెను చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కోంది. అనంతరం ఆ వీడియోను చూపిస్తూ తాము చెప్పినట్లు వినకపోతే  తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

కాలేజీ యజమాని అనుచరులు ఇటీవల ఒక రోజు ఇంటికొచ్చి, తనను, తన తల్లిని తిడుతూ, హత్య చేస్తామని బెదిరించారని చెప్పింది. వారు చెప్పినట్లు వినట్లేదని తనపై పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు కూడా పెట్టారని  ఆమె తెలిపింది.

కాలేజీ యజమాని పెట్టిన తప్పుడు కేసులో పుళల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి వివరణ కూడా ఇచ్చానని తన ఫిర్యాదులో వివరించింది. కాలేజీ యజమాని నుంచి తనకు రక్షణ కల్పించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ నటి పోలీసులను కోరింది.