వాడు కామపిశాచి : ఉద్యోగాల పేరుతో అమ్మాయిలకు ఎర

ఉద్యోగాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ప్రదీప్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన ప్రదీప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో మహిళల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని అమ్మాయిలతో చాటింగ్ ప్రారంభించాడు. తనకు తెలిసిన కార్పొరేట్ కంపెనీలు, ఫైవ్ స్టార్ హోటల్స్ లో రిసెప్షనిస్ట్,తదితర ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని వారిని నమ్మించేవాడు. అయితే ఆ ఉద్యోగాలకు అందమైన అందమైన శరీరాకృతి ఉండాలని మహిళలను నమ్మించి వారి ఫొటోలను తీసుకునేవాడు. అంతేకాకుండా న్యూడ్ ఫొటోలు కూడా అడిగేవాడు.
నగ్న చిత్రాలు పంపితేనే ఉద్యోగమంటూ ట్రాప్ చేశాడు. ఉద్యోగం అనే సరికి ప్రదీప్ ని గుడ్డిగా నమ్మిన దాదాపు 2వేల మంది మహిళలు తమ న్యూడ్ ఫొటోలను ప్రదీప్ కి ఫేస్ బుక్ ద్వారా పంపించారు. దీంతో కొన్ని రోజుల తర్వాత అవే ఫొటోలను ఆ అమ్మాయిలకు చూపించి వారిని బ్లాిక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో విషయం బయటికి పొక్కితే తమ కుటుంబం పరువు పోతుందన్న భయంతో మహిళలందరూ ప్రదీప్ పై కంప్లెయింట్ ఇవ్వలేదు.
చివరికి ప్రదీప్ మోసాన్ని ఓ మహిళ నిర్భయంగా బయటపెట్టింది. తనలా మరొక అమ్మాయికి ఇలా జరగకూడదని భావించి ప్రదీప్ గురించి పోలీసులకు కంప్లెయింట్ చేసింది. మహిళ కంప్లెయింట్ తో ప్రదీప్ ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ దగ్గర నుంచి పలు సిమ్ కార్డులు,ల్యాప్ టాప్ లు,ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.