Student Shot: వామ్మో.. దూరం పెట్టాడని దారుణం.. క్లాస్‌మేట్‌పై విద్యార్థి కాల్పులు..

11వ తరగతి విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన తండ్రి దగ్గరున్న లైసెన్స్డ్ పిస్టల్ తీసుకొచ్చి క్లాప్ మేట్ పై కాల్పులు జరిపాడు.

Student Shot: వామ్మో.. దూరం పెట్టాడని దారుణం.. క్లాస్‌మేట్‌పై విద్యార్థి కాల్పులు..

Updated On : November 11, 2025 / 8:38 PM IST

Student Shot: గురుగ్రామ్ లో దారుణం జరిగింది. 11వ తరగతి విద్యార్థి చేసిన పని అందరినీ షాక్ కి గురి చేస్తోంది. పిల్లల్లో విపరీత ధోరణి ఆందోళనకు గురి చేస్తోంది. తనను పట్టించుకోవడం లేదని, నిత్యం ఫోన్ లో బిజీగా ఉంటున్నాడని తన క్లాస్ మేట్ ను అతడు గన్ తో కాల్చాడు. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నాడు.

గురుగ్రామ్ లోని సెంట్రల్ పార్క్ సొసైటీ సెక్టార్ 48లోని ఓ ప్లాట్ లో ఈ ఘోరం జరిగింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి వయసు 17ఏళ్లు. మెడ ఎముక దగ్గర తీవ్ర గాయమైంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

తనను పట్టించుకోవడం లేదని, నిత్యం ఫోన్ లో బిజీగా ఉంటున్నాడనే కోపంతో.. 11వ తరగతి విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన తండ్రి దగ్గరున్న లైసెన్స్డ్ పిస్టల్ తీసుకొచ్చి క్లాప్ మేట్ పై కాల్పులు జరిపాడు.

ఫరీదాబాద్ లోని కరెక్షన్ హోమ్ లో వీరిద్దరూ ఉంటున్నారు. రెండు నెలల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పిల్లల్లో విపరీత ధోరణికి ఈ ఘటన అద్దం పడుతోంది. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఈ పగ, ప్రతీకారాలు ఏంటని విస్తుపోతున్నారు. ఈ ఘటన సహచర విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై హర్యానా డీజీపీ స్పందించారు. పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలకు కీలక విజ్ఞప్తి చేశారు. పిల్లలకు మంచి బుద్ధులు, బాధ్యతగా ఉండటం నేర్పాలని ఆయన సూచించారు.

Also Read: కుప్పకూలిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్.. వీడియో వైరల్..