జంతువైద్యునికి జైలుశిక్ష: కుక్కపిల్లల్లో హెరాయిన్ స్మగ్లింగ్
విదేశాల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ మాఫియా యధేచ్చగా కొనసాగుతోంది. అంతర శరీర భాగాల్లో డ్రగ్స్ దాచేసి గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుల్లోకి వస్తున్నాయి.

విదేశాల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ మాఫియా యధేచ్చగా కొనసాగుతోంది. అంతర శరీర భాగాల్లో డ్రగ్స్ దాచేసి గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుల్లోకి వస్తున్నాయి.
విదేశాల్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ మాఫియా యధేచ్చగా కొనసాగుతోంది. అంతర శరీర భాగాల్లో డ్రగ్స్ దాచేసి గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుల్లోకి వస్తున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి విమానాల్లో హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఏదొక రూపంలో స్మగ్లింగ్ మాఫియా అక్రమ రవాణా చేస్తూనే ఉన్నాయి. చివరికి జంతువుల ద్వారా కూడా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్నారు. కుక్కపిల్లల అంతర అవయవాల్లో హెరాయిన్ పెట్టి యునైటెడ్ స్టేట్స్ అక్రమంగా రవాణా చేస్తు ఓ కొలంబియన్ వెటర్నరీ డాక్టర్ అడ్డంగా దొరికిపోయాడు. హెరాయిన్ ను లిక్విడ్ రూపంలో బతికి ఉన్న కుక్కపిల్లల్లో పెట్టి సర్జరీ చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు యూఎస్ పోలీసులు గుర్తించారు. ఆండ్ర్యూ లోపెజ్ ఎల్రోజ్ (39)గా న్యూయార్క్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
యూనైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కోర్టు గురువారం (ఫిబ్రవరి 7, 2019) డ్రగ్స్ స్మగ్లింగ్ యాక్ట్ కింద నిందితుడు జంతువైద్యుడికి ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. సెప్టెంబర్ 2004, జనవరి 2005 మధ్య కాలంలో ఎల్రోజ్ తొమ్మిది కుక్కపిల్లల్లో లిక్విడ్ హెరాయిన్ పెట్టి యూఎస్ కు ఇంపోర్ట్ చేస్తున్నాడు. 2005 న్యూ ఇయర్ డే సందర్భంగా కొలంబియా సిటీలోని మెడిల్లిన్ ఫాంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫాంలో ఉన్న కుక్కపిల్లల అంతర భాగాల్లో 17వరకు లిక్విడ్ హెరాయిన్ ఉన్నట్టు గుర్తించారు. కుక్కపిల్లల నుంచి పది వరకు హెరాయిన్ తొలగించగా.. సర్జరీ సమయంలో వైరస్ సోకి మూడు కుక్కపిల్లలు చనిపోయాయి. పోలీసులు రైడ్ చేసిన సమయంలో ఎల్రోజ్ పరారయ్యాడు.
2015లో స్పెయిన్ లో పోలీసులు అతడ్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో గత మేనెలలో యూనైటెడ్ స్టేట్స్ నుంచి ఎల్రోజ్ ను బహిష్కరించారు. ఆరేళ్ల జైలు శిక్ష అనంతరం ఎల్రోజ్ ను తిరిగి కొలంబియాకు అప్పగించనున్నారు. ‘‘ ప్రతి కుక్కకు ఓ రోజు ఉంటుంది.. ఈ రోజు ఎల్రోజ్ వంతు వచ్చింది. చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు’’ అని యూఎస్ అటార్నీ రిచార్డ్ డొన్హోగే విచారణ సమయంలో అభిప్రాయపడ్డారు.