బనగానపల్లెలో ఉద్రిక్తత : టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తమ్ముడు రాజారెడ్డి సహాయకుడు గోపాల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. డబ్బులు పంపిణీ విషయంలో పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు పంచుతుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల డబ్బులు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించినప్పటికీ డబ్బుల పంపిణీ యథావిధిగా కొనసాగుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టడం సరైందని కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.