Cyber Crime : ఘరానా మోసం.. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ వచ్చిందా? మాట్లాడారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడం ఖాయం..!

సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెబుతున్నారు.

Cyber Crime : ఘరానా మోసం.. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ వచ్చిందా? మాట్లాడారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడం ఖాయం..!

Updated On : February 20, 2025 / 9:44 PM IST

Cyber Crime : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మాటలతో మాయ చేసి మొత్తం దోచేస్తున్నారు. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. బ్యాంకు ప్రతినిధిని అంటూ ఓ డ్రైవర్ కి ఫోన్ చేసిన సైబర్ క్రిమినల్.. అతడి బ్యాంకు ఖాతా నుంచి 79వేల రూపాయలు కొట్టేశాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా మిరా బయందర్ లో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. మీరా రోడ్ లో నివాసం ఉండే 45ఏళ్ల డ్రైవర్ బ్యాంకు ఖాతా నుంచి 10వేలు కట్ అయ్యాయి. తనకు తెలియకుండానే ఆ డబ్బులు కట్ అయ్యాయి. 2024 అక్టోబర్ లో ఈ ఘటన జరిగింది. దీనిపై అతడు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు.

తన డబ్బులు 10వేలు ఖాతా నుంచి కట్ అయ్యాయని, వెనక్కి ఇప్పించాలని కోరాడు. దీనిపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన అతడు.. తన డబ్బు గురించి పలు మార్లు బ్యాంకు అధికారులను కలిశాడు. వారితో టచ్ లో ఉన్నాడు.

Also Read : 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకిన హైదరాబాద్ లేడీ డాక్టర్.. ఆ తర్వాత ఎంత ఘోరం జరిగిందంటే.. బీకేర్ ఫుల్..

కాగా, ఇటీవల అతడికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను బ్యాంకు ప్రతినిధిని అంటూ అతడు పరిచయం చేసుకున్నాడు. మీ 10వేల పోయాయి కదా.. తిరిగి వచ్చేలా చూస్తానని, నేను మీకు సాయం చేస్తానని డ్రైవర్ ని తన మాయ మాటలతో నమ్మించాడు.

అప్పటికే పలుసార్లు బ్యాంకు అధికారులతో మాట్లాడిన బాధితుడు.. తనకు కాల్ చేసి వ్యక్తి బ్యాంకు ప్రతినిధి అయి ఉంటాడని నమ్మేశాడు. తన మాటలతో బాధితుడిని బుట్టలో వేసుకున్న సైబర్ క్రిమినల్.. అతడి ఫోన్ లో ఓ కస్టమర్ కేర్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేయించాడు.

ఆ తర్వాత తన బ్యాంకు ఖాతా వివరాలను అందులో ఎంటర్ చేయాలని చెప్పాడు. అతడు చెప్పినట్లే బాధితుడు అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసి బ్యాంకు వివరాలు ఎంటర్ చేశాడు. అంతే, డ్రైవర్ కి దిమ్మతిరిగిపోయింది. అతడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 79వేల రూపాయలు కట్ అయ్యాయి. దాంతో అతడు బిత్తరపోయాడు.

తాను మోసపోయాను అని తెలుసుకోవడానికి అతడికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే అతడు 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

కాగా, సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెబుతున్నారు. వారి మాటలు నమ్మితో మోసపోతారని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చుకు చిక్కుతున్నారు. వారి చెప్పింది గుడ్డిగా నమ్మి డబ్బులు పొగొట్టుకుంటున్నారు.

Also Read : కాసేపట్లో రిస్పెన్షన్.. వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు.. రూ.10లక్షల విలువైన నగలతో జంప్..

బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని అడిగారంటే.. కచ్చితంగా అది మోసమే అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. వాస్తవానికి బ్యాంకు సిబ్బంది ఎవరూ ఫోన్ చెయ్యరు. ఒకవేళ చేసినా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు డీటైల్స్, ఓటీపీలు, పాస్ వర్డ్స్ అస్సలు అడగరు. యాప్స్ కానీ అప్లికేషన్లు కానీ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. అలా అడిగారంటే.. కచ్చితంగా వాళ్లు సైబర్ క్రిమినల్స్ అయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.