వంటింట్లో ’సిలిండర్’ బాంబులు

వంటింట్లో గ్యాస్ వణికిస్తోంది. వరుస సిలిండర్ పేలుళ్లు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 03:32 AM IST
వంటింట్లో ’సిలిండర్’ బాంబులు

వంటింట్లో గ్యాస్ వణికిస్తోంది. వరుస సిలిండర్ పేలుళ్లు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్లు దడ పుట్టిస్తున్నాయి. వంటింట్లో గ్యాస్ వణికిస్తోంది. వరుస సిలిండర్ పేలుళ్లు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. వంట గ్యాస్ ఉపయోగించడంలో వినియోగదారుల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, సిలిండర్ డోర్ డెలివరీ కాగానే తనిఖీ చేయకపోవడం, గ్యాస్ లేకేజీలపై చిన్నపాటి ఏమరుపాటు వంటి కారణాలతో గ్యాస్ సిలిండర్ పేలుళ్లు సంభవిస్తున్నాయి.

ప్రధాన ఆయిల్ కంపెనీలు కనీస భద్రత ప్రమాణాలను గాలికి వదిలేశాయి. ఏడాదికి ఒకసారి మొక్కుబడిగా అవగాహన సదస్సు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద అత్యవసర సేవలకు సంబంధించి టెక్నికల్ సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ కాలపరిమితి బట్టి గుర్తించవచ్చు. డ్యూడేట్ లు సిలిండర్ పై త్రైమాసానికి ఒక కేటగిరిగా అక్షరాలు ఉంటాయి. అక్షరంతోపాటు అంకె అంటే…కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ఉదాహరణకు సిలిండర్ పైన ఏ 19, బీ19, సీ19, డీ19 అనే అక్షరాలు ఉంటాయి. ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అంటే అక్టోబర్ నుంచి డిసెండర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. అయితే ఖాళీ అయిన సిలిండర్ నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే రీఫిల్లింగ్ పాయింట్ లో కాలపరిమితి ఆధారంగా రీఫిల్లింగ్ చేసి వినియోగదారులకు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది.

 
వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద టెక్నీషియన్స్ కొరత అధికంగా ఉంది. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ పరిధిలో వేలాది కనెక్షన్షలు ఉన్నా.. సిబ్బంది మాత్రం ఇద్దరు, ముగ్గురికి మించి ఉండరు. దీంతో వినియోగదారుల అత్యవసర నంబర్ కు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఒక్కోసారి డెలివరీ బాయ్స్ నే టెక్నీషియన్స్ అంటూ పంపించి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు.

గ్యాస్ విస్పోటనాలకు మానవ తప్పిదాలు కూడా ప్రధానంగా కారణమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల లీకేజీలు, సిలిండర్, రెగ్యులేటర్, రబ్బర్ ట్యూబ్ ల నాణ్యత, వాటి తనిఖీల్లో నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కొత్త సిలిండర్ అమర్చే సమయంలో రెగ్యులేటర్, వాచర్ రెండూ సరిగ్గా ఇమడక గ్యాస్ బయటకు వస్తోంది. గ్యాస్ లీక్ గమనించకపోవడం, రబ్బర్ ట్యూబ్ వినియోగించడం, వంట చేసే సమయంలో గ్యాస్ ను సిమ్ లో ఉంచి మరిచిపోవడం, బర్నర్ మూసుకుపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.