Dalit Student : యూపీలో దళిత విద్యార్థిని దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు వ్యక్తులు

కాల్పుల్లో చనిపోయిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Dalit Student : యూపీలో దళిత విద్యార్థిని దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు వ్యక్తులు

Dalit Student

Updated On : April 18, 2023 / 1:36 AM IST

Dalit Student : ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓ దళిత విద్యార్థిని దారుణ హత్య గావించబడ్డారు. ఇద్దరు వ్యక్తులు దళిత విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటన బలౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. కాల్పుల్లో చనిపోయిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోష్ని అహిర్వార్(21) బీఏ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో రోష్ని అహిర్వార్ సోమవారం ఉదయం జలౌన్ లోని రామ్ లఖన్ పటేల్ మహా విద్యాలయానికి వెళ్లి పరీక్ష రాశారు. అనంతరం ఉదయం 11 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు విద్యార్థిని దగ్గరకు వెళ్లారు. ఒక వ్యక్తి తుపాకీతో విద్యార్థిని తలపై కాల్పులు జరిపాడు.

Dalit boy beaten to death: నీరు తాగడానికి కుండను ముట్టుకున్న దళిత బాలుడు.. కొట్టి చంపిన టీచర్

దీంతో ఆమె రక్తం మడుగుల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డుపై ఉన్న వారంతా ఈ సంఘటనను చూసి షాక్ కు గురయ్యారు. విద్యార్థిని రోహ్నిపై గన్ తో కాల్పులు జరిపిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులు వారిపైకి తుపాకీ విసిరి అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో జరుగడం కలకలం రేపుతోంది.

తుపాకీ కాల్పుల్లో తమ కుమార్తే మరణించిన విషయం తెలిసి విద్యార్థిని తల్లిదండ్రులు బోరున విలపించారు. రాజ్ అహిర్వార్ అనే వ్యక్తిపై అసహనం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిని రోహ్నిని గన్ తో కాల్చి చంపిన నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీస్ అధికారి పేర్కొన్నారు.