మిస్టరీ ఏంటి : ప్రముఖ హీరో పొలంలో కుళ్లిపోయిన మృతదేహం

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయక్షేత్రంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్టేజ్ లో డెడ్ బాడీ కనిపించింది.

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 02:49 AM IST
మిస్టరీ ఏంటి : ప్రముఖ హీరో పొలంలో కుళ్లిపోయిన మృతదేహం

Updated On : September 19, 2019 / 2:49 AM IST

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయక్షేత్రంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్టేజ్ లో డెడ్ బాడీ కనిపించింది.

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయక్షేత్రంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్టేజ్ లో డెడ్ బాడీ కనిపించింది. షాద్‌నగర్‌ మండలంలోని పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో కొనుగోలు చేశాడు. అయితే పొలంలోని ఓ ప్రాంతంలో ఉన్న గదిలో.. కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు… వ్యవసాయ క్షేత్రంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయినది ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నారు. 

హీరో పొలంలో మృతదేహం దొరకడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఆ హీరో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిపుణులను పంపారు. పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. శవం దొరికిన గదిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు ఆ వ్యక్తి ఎవరు..? ఎప్పుడు మరణించాడు..? ఎవరు చంపారు..? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై ఇంకా ఆ ప్రముఖ హీరో స్పందించలేదు. 2018 జూలైలో ఇదే ఫాంహౌస్‌లో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే.