CM Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం.. బీజేపీ కుట్ర చేస్తోంది.. హరీష్రావు సూచనలతోనే ఈటల మాటలు..
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ అన్నారు. హరీశ్ రావు సూచనల మేరకే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారని అన్నారు. కాళేశ్వరంపై ఎంపీ ఈటల అవాస్తవాలు చెప్పారు.. ఎంపీ ఈటల అంటే మాకు గౌరవమే.. తన వ్యాఖ్యలతో ఈటల తన గౌరవం పొగొట్టుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మా ప్రయత్నం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
