Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఆరు వేల పేజీల చార్జిషీటు దాఖలు.. విచారణలో సంచలన విషయం వెల్లడి

మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల్ని నమోదు చేశారు.

Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఆరు వేల పేజీల చార్జిషీటు దాఖలు.. విచారణలో సంచలన విషయం వెల్లడి

Updated On : January 24, 2023 / 7:35 PM IST

Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసు విచారణ పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు దీనిపై చార్జిషీటు దాఖలు చేశారు. మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు.

Pawan Kalyan : కొండగట్టులో ‘వారాహి’కి జనసేనాని పూజలు..

కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల్ని నమోదు చేశారు. అలాగే ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్, ఇతర శాస్త్రీయ ఆధారాల్ని కూడా చార్జిషీటుతోపాటు పొందు పరిచారు. ఆఫ్తాబ్ పూనావాలా-శ్రద్ధా వాకర్ ఢిల్లీలో సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆఫ్తాబ్, శ్రద్ధా వాకర్‌ను గత ఏడాది మే 18న హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో పడేశాడు. కొంతకాలానికి శ్రద్ధ తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి, ఆఫ్తాబ్‌ను అరెస్టు చేశారు.

Air India: ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ.. పది లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. ఈసారి ఎందుకంటే

శ్రద్ధ శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు రీకన్‌స్ట్రక్షన్‌తోపాటు, పాలిగ్రాఫ్, నార్కో వంటి పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ కేసులో చార్జిషీటును కోర్టులో సమర్పించారు. నిందితుడు ఆఫ్తాబ్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఫిబ్రవరి 7 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 7న ఆఫ్తాబ్‌ను నేరుగా కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్ని పేజీల చార్జిషీటు దాఖలు చేశారని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. దీనికి పోలీసులు 6,629 పేజీల చార్జిషీటు దాఖలు చేశామని సమాధానం ఇచ్చారు. దీంతో అవన్నీ విలువైనవేనా అని ప్రశ్నించింది కోర్టు.

పోలీసుల విచారణలో మరో సంచలన విషయం బయటపడింది. హత్య జరగడానికి ముందు శ్రద్ధ ఒక స్నేహితుడిని కలుసుకుందని, అది కూడా ఆఫ్తాబ్ ఆగ్రహానికి కారణమైందని తాజాగా పోలీసుల విచారణలో తేలింది.