భర్తతో విడాకులు-ప్రియుడితో సహజీవనం… ప్రియుడు,కూతుళ్లు కలిసి హత్య

  • Published By: murthy ,Published On : June 23, 2020 / 08:02 AM IST
భర్తతో విడాకులు-ప్రియుడితో సహజీవనం… ప్రియుడు,కూతుళ్లు కలిసి హత్య

Updated On : June 23, 2020 / 8:02 AM IST

భర్తతో మనస్పర్ధలు వచ్చిన ఒక మహిళ అతడ్నించి విడాకులు తీసుకుంది. పెళ్లీడు కొచ్చిన కూతుళ్ళను తీసుకుని వేరు కాపురం పెట్టింది. అక్కడామెకు ఒక వ్యక్తితో పరిచయం అయి సహజీవనం చేయటం మొదలెట్టింది. వారిద్దరికీ మరో పాప పుట్టింది. ఇప్పుడు ప్రియుడు, ఇద్దరు కూతుళ్ళు కలిసి ఆమెను హత్య చేశారు.
 
గుజరాత్లోని అహమ్మదాబాద్, అమరైవాడీకి చెందిన రంజన్ సోలంకి(37) భర్తతో విడిపోయి తన ఇద్దరు కూతుళ్లతో (ఒకరికి 19, ఒకరికి17 ఏళ్లు) కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈమెకు మూడున్నరేళ్ళ క్రితం గిరీష్ పరామర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అనంతరం ఆమె తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసింది. గిరీష్ ద్వారా రంజన్ ఒక పాపకు జన్మనిచ్చింది. ఆపాపకి ఇప్పడు రెండేళ్ళు.

కాగా…. రంజన్ తరచుగా తన ప్రియుడు గిరీష్,  పెద్దకూతురు, అల్లుడిని డబ్బు కోసం వేధిస్తూ ఉండేది. తన అల్లుడి వద్ద కూడా ఆమె డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వటంలో విఫలం అయ్యింది. దీంతో అల్లుడు తన భార్యను పుట్టింటికి పంపించాడు. రంజన్ పెద్ద కూతురు నాలుగు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. తల్లి, తన భర్తకు డబ్బుచెల్లించకపోవటం కారణంగానే తాను భర్తకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆమె తరచూ బాధ పడుతూ తల్లిపై కోపం పెంచుకుంది. 

రంజన్ ప్రియుడు  పరామర్ కూడా తరచూగా డబ్బు అడగటంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె డబ్బు పిచ్చి భరించలేక పరామర్, రంజన్ కూతుళ్లు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. రంజన్ నిద్రపోతుండగా ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత పెద్ద కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి తల్లి చనిపోయిందని కంప్లయింట్ ఇచ్చింది. 

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కూతుళ్ళ ప్రవర్తనమీద అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి కూతుళ్లు నేరం ఒప్పుకున్నారు.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

గిరీష్ పరామర్ 
girish paramar