Guntur Drowned Boy : వాగులో పడి కొట్టుకుపోయిన బాలుడు మృతి

గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం పీకల వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమయ్యింది.

Guntur Drowned Boy : వాగులో పడి కొట్టుకుపోయిన బాలుడు మృతి

Drowned Boy Into The Drainage In Guntur Found Dead

Updated On : June 27, 2021 / 4:43 PM IST

Guntur Drowned Boy : గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం పీకల వాగులో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. నగరంలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సంపత్ నగర్ సమీపంలోని పీతలవాగు ఉధృతంగా ప్రవహించింది.

మెడికల్ క్లబ్ వెనుక భాగంలో ఉన్న పీకలవాగులో పడి బాలుడు ముంగి వెంకటేష్ (5) గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తక్షణమే ఎన్డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపి రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం సంపత్ నగర్ దాటిన తర్వాత బాలుడు మృత దేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని జిజిహెచ్ మార్చురీ కు తరలించారు.