అప్పుడు.. ఇప్పుడు.. సజ్జనారే 

  • Published By: chvmurthy ,Published On : December 6, 2019 / 05:04 AM IST
అప్పుడు.. ఇప్పుడు.. సజ్జనారే 

Updated On : December 6, 2019 / 5:04 AM IST

2008లో వరంగల్ లో జరిగిన సీన్, 2019 డిసెంబర్ 6న  చటాన్ పల్లిలో రిపీట్ అయ్యింది. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతల పై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను.. 3రోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను  పోలీసులు ఎన్కౌంటర్ లో మట్టుబెట్టారు. 

అప్పట్లో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్ కౌంటర్ పై  హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అప్పుడు, ఇప్పుడు ఎన్కౌంటర్ క్రెడిట్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జాన్నార్ దే….సరిగ్గా 11 ఏళ్ల తరువాత సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయ్యింది….అప్పుడు, ఇప్పుడు డిసెంబర్ నెల కావడం గమనార్హం.

అప్పుడేమయ్యింది
వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2008 డిసెంబరు 10వ తేదీన వరంగల్ లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వప్నిక, ప్రణీత లు బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన ప్రణీత తర్వాత నిదానంగా కోలుకుంది. 

ఘటనకు పాల్పడిన నిందితులను  పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పట్లో వరంగల్ ఎస్పీగా సీపీ సజ్జనార్ ఉన్న సమయంలో యాసిడ్ దాడి చేసిన  శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణలు ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. గతంలో కూడా వారు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ఆత్మరక్షణ కోసమే పోలీసుల కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రకటించారు. 
తాజాగా నాటి వరంగల్ ఎస్పీగా దేశం మొత్తాన్ని చర్చించుకునే లా స్వప్నిక, ప్రణీతల యాసిడ్ దాడి నిందితులను ఎన్కౌంటర్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన సజ్జనార్ ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నారు . ఈ ఘటనను కూడా సీరియస్ గా తీసుకున్న సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయడానికి చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు వెళ్లిన క్రమంలో నిందితులు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు.

పోలీసులు వాహనాల పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిందితులను ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎన్ కౌంటర్ చేసినట్లుగా తెలుస్తుంది.  గతంలో స్వప్నిక ప్రణీత ల యాసిడ్ దాడి నిందితులకు సజ్జనార్ వరంగల్ ఎస్పీ గా ఉన్న సమయంలో ఏదైతే శిక్ష పడిందో ఇప్పుడు దిశ హత్య కేసు నిందితులకు అదే శిక్ష పడడం …హాట్ టాపిక్ గా మారింది. 

వారం రోజులుగా అన్ని వర్గాల నుండి వస్తున్న ఒత్తిడి,దిశ కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు కిందిస్థాయి సిబ్బంది సరిగా స్పందించలేదన్న కారణం మొత్తం పోలీస్ శాఖ ఇమేజ్ డ్యామేజ్ చేసింది  తాజాగా దిశనిందితులను ఎన్ కౌంటర్ చేయడం ఆ మచ్చ తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో పోలీసుల చర్యను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సీపీ సజ్జనార్ కు జై కొడుతున్నారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు.