kidnap Wife : విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్ చేయబోయి….

విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడో వ్యక్తి. కిడ్నాప్ అడ్డుకున్న ఆమెపై దాడి చేసి గాయపర్చాడు.

kidnap Wife : విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్ చేయబోయి….

Ex Husband Tried Kidnap Wife In Hyderabad

Updated On : April 26, 2021 / 3:09 PM IST

Ex-Husband tried kidnap wife in Hyderabad : విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడో వ్యక్తి. కిడ్నాప్ అడ్డుకున్న ఆమెపై దాడి చేసి గాయపర్చాడు. జూబ్లీహిల్స్‌లో నివాసముండే మహిళ కొద్ది కాలం క్రితం చావ వినయ్‌ చౌదరిని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

పెళ్లైయ్యాక ఇద్దరి మధ్య గొడవలు రావటం మొదలయ్యాయి. రాన్రాను మనస్పర్ధలు ఎక్కువ అవటంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త పెట్టే గృహహింస కారణంతో విడాకులు కూడా తీసుకున్నారు.

కాగా …ఈ నెల 18న వినయ్‌ ఆమె ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ గొడవ చూసిన స్థానికులు వినయ్‌ను అడ్డుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి అతడిపై ఐపీసీ 448,354,427,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.