Morphed Photos, Videos : అశ్లీల మార్ఫింగ్ వీడియోలతో మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఫేస్‌బుక్ స్నేహితురాలు

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ , ఔత్సాహిక మోడల్ గా పని చేస్తున్న మరో మహిళను మార్ఫింగ్  ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

Morphed Photos, Videos : అశ్లీల మార్ఫింగ్ వీడియోలతో మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఫేస్‌బుక్ స్నేహితురాలు

Modal Black Mailing

Updated On : November 14, 2021 / 3:43 PM IST

Morphed Photos, Videos : ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ , ఔత్సాహిక మోడల్ గా పని చేస్తున్న మరో మహిళను మార్ఫింగ్  ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.  బెంగుళూరుకు చెందిన సుమిత్ర(పేరు మార్చబడింది) అనే ఔత్సాహిక మోడల్ కు కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో సోనియా ఫర్నదిస్ అనే పేరుతో ఒక మహిళ పరిచయం అయ్యింది.

తాను మోడలింగ్ రంగంలోనే ఉన్నా అని చెప్పుకున్న ఫర్నదిస్…. మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ సుమిత్ర ఫోటోలు పంపాలని కోరింది. తనకు మోడల్ గా అవకాశాలు వస్తాయనే ఆశతో సుమిత్ర ఆమె చెప్పినట్టే చేసింది. కొద్దిరోజులకు సోనియా నుంచి కొన్ని వీడియోలు ఫోటోలు సుమిత్ర కు వచ్చాయి.

Aksi Read : Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు

అందులో సుమిత్ర ఫోటోలు, వీడియోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఉన్నాయి. వాటిని  చూసి షాకుకు గురైంది సుమిత్ర.  సోనియాకు ఫోన్ చేయగా ఆమె బ్లాక్ మెయిల్ చేయసాగింది.  సుమిత్ర ఒరిజినల్ న్యూడ్ వీడియోలు, ఫోటోలు పంపకపోతే   వీటినే సోషల్ మీడియాలో పోస్ట్   చేస్తానని బెదిరించింది. సుమిత్ర వెంటనే  బెంగుళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.