Gujarat : సూరత్ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలు ..

గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సూరత్ లో ఫర్నీచర్ వ్యాపారం చేసే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.

Gujarat : సూరత్ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలు ..

bodys found In surat merchant house

bodys found In surat merchant house : గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సూరత్ లోని పాలన్ పూర్ జకత్నాక్ రోడ్డులో ఫర్నీచర్ వ్యాపారం చేసే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

శనివారం ఉదయం సూరత్‌లో అడాజన్ ప్రాంతంలోని సిద్ధేశ్వర్ అపార్ట్ మెంట్ ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగువారు డోర్‌ కొట్టారు. కానీ లోపలి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. కాలింగ్ బెల్ కొట్టినా ఎంతసేపటికి ఎవ్వరు తలుపులు తీయకపోవటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటి డోర్‌ను పగులగొట్టి చూడగా ఏడుగురు చనిపోయినట్లుగా నిర్ధారించారు. అక్కడే సూసైడ్ నోట్ కనిపించటంతో కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతులు 35 ఏళ్ల మనీష్ సోలంకి, 32 ఏళ్ల భార్య రీటా, పిల్లలు 7ఏళ్ల దిశ, 5ఏళ్ల కావ్య, 3ఏళ్ల ఖుషాల్‌, మనీష్‌ తల్లిదండ్రులైన 65 ఏళ్ల కాంతిలాల్‌ సోలంకి, 60 ఏళ్ల శోభనగా గుర్తించారు.

Dinosaur Bones : చైనాకు డైనోసార్ ఎముకల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్ .. వాటి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కుటుంబంలోని ఆరుగురు విషం తాగి చనిపోగా మనీష్‌ మాత్రం ఉరి వేసుకుని చనిపోయినట్లుగా గుర్తించారు. మనీష్ సోలంకి వ్యాపారం ఆర్థిక సమస్యలు రావటంతో అప్పులు చేయటం వాటిని తీర్చాలనే ఒత్తిడి రావటంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా లెటర్ లో పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సూసైట్ నోట్ తో పాటు విషం బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న తీరును బట్టి మనీష్ ముందు కుటుంబ సభ్యులకు విషం ఇచ్చిన తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సూరత్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ బరోట్ తెలిపారు.