తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం : పెట్రోల్ బాటిల్ తో వచ్చిన రైతు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని అధికారులపై

మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని అధికారులపై
మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కి వచ్చి హల్ చల్ చేశాడు. పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెట్రోల్ బాటిల్ తీసుకుని రావడంతో కార్యాలయంలో కాసేపు కలకలం రేగింది. సిబ్బందితో ఆ రైతుతో వాగ్వాదానికి దిగాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, సిబ్బంది అతడికి నచ్చ చెప్పారు.
రైతు పేరు అశోక్. చిల్లంచెల్ల గ్రామవాసి. తనకి తాతల నుంచి వారసత్వంగా 5 ఎకరాల సాగు భూమి ఉందన్నాడు. అయితే రెండున్నర ఎకరాల భూమికి మాత్రమే పట్టా పాసు పుస్తకం ఇచ్చారని.. మిగిలిన భూమిలో తిరకాసు పెట్టారని అశోక్ వాపోయాడు. ఇందులో కొంత ప్రభుత్వం ఉందని అధికారులు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలలు తరబడి ఆఫీస్ చుట్టు తిప్పుకున్నారని.. అయినా పని జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను సహనం కోల్పోయానని.. అందుకే ఇలా పెట్రోల్ బాటిల్ తో వచ్చానని వివరించాడు. ఆ భూమే తన కటుంబానికి ఆధారం అని అశోక్ స్పష్టం చేశాడు.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయవారెడ్డి సజీవదహనం ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పోరుబాట పట్టారు. రెవెన్యూ అధికారుల తీరుపై తిరగబడుతున్నారు. తమ పనులు చేయకపోతే చంపేస్తామని కొందరు.. ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు ఏకంగా పెట్రోల్, కిరోసిన్ బాటిల్స్ తో ఆఫీసులకి వస్తుండటం రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన నింపింది. ఈ పరిణామాలు రెవెన్యూ సిబ్బందిలో వణుకు పుట్టిస్తున్నాయి. ఇలా అయితే విధులు నిర్వహించలేము అని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలంటున్నారు.