Family Attack : తండ్రి ప్రాణం తీసిన కొడుకు ప్రేమ వ్యవహారం

Family Attack : తండ్రి ప్రాణం తీసిన కొడుకు ప్రేమ వ్యవహారం

Family Attack

Updated On : April 21, 2021 / 1:46 PM IST

Father died due to girl family attack in nalgonda district  : వయస్సులో ఉన్న ఒక యువకుడి ప్రేమ వ్యవహారం యువకుడి తండ్రి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకువెళ్లాడనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు చేసిన దాడిలో యువకుడి తండ్రి కన్నుమూశాడు.

నల్గోండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామానికి చెందిన దేవదానం,జ్యోతి దంపతులు కుమారుడు శ్రీకాంత్(20) అదే గ్రామానికి చెందిన యువతి(19)తో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం ఇటీవల ఇంట్లో పెద్దలకు తెలిసింది. ఈనెల 19న వారిద్దరూ ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇళ్లనుంచి వెళ్లి పోయారు.

అయితే తమ కుమార్తెకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంటినుంచి తీసుకువెళ్లిపోయాడని …తమ పరువు పోయిందని యువతి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో శ్రీకాంత్ తండ్రికి దెబ్బలు తగిలి మరణించాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు ఏర్పాటు చేశారు. యువతి కుటుంబ సభ్యులు దాడి చేయటం వల్లే దేవదానం చనిపోయాడని కుటుంబ సభ్యలు ఆరోపించారు.