భర్త రెండో భార్య పిల్లల్ని చంపి మొదటి భార్య ఆత్మహత్య

First Wife Kills Husband Second Wife Children After She Commits Suicide
First wife kills husband Second wife children : నల్లగొండ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. భర్త రెండో భార్యకు చెందిన ఇద్దరు పిల్లల్ని మొదటి భార్య చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ కలెక్టరేట్ సమీపంలో గురువారం (డిసెంబర్ 10, 2020) ఈ సంఘటన చోటుచేసుకుంది. మేకల ప్రదీప్, ప్రసన్నరాణిలు దంపతులు.
ప్రదీప్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రసన్నరాణిని వదిలివేశాడు. శాంతి అనే మరో మహిళను ప్రదీప్ రెండో పెండ్లి చేసుకున్నారు. వీరికి మేఘన(6), రుచరి(4) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో మొదటి భార్య.. భర్త రెండో భార్య కుటుంబంపై కక్ష్య పెంచుకుంది.
రెండో భార్య సంతానమైన ఇద్దరు అమ్మాయిల మెడలకు తాళ్లు బిగించి హత్య చేసింది. అనంతరం తాను సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రదీప్ రామన్నపేటలో, ప్రసన్నరాణి మునుగోడులో, శాంతి జిల్లా కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు.