ఆర్టీసీ బస్సు-కారు ఢీ..నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కలకడ మండలం మహల్ క్రాస్‌రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు.. కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు.
క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కడప జిల్లా రాయచోటి వాసులుగా గుర్తించారు. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న మోనీషాను చికిత్స కోసం గురువారం (డిసెంబర్ 26, 2019) తెల్లవారుజామున రాయచోటి నుంచి చిత్తూరు సమీపంలోని తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు డాక్టర్లు వైద్య చికిత్సలు అందించిన తర్వాత తిరిగి రాయచోటికి బయలుదేరారు. మార్గంమధ్యలో చిత్తూరు జిల్లా కలకడం మండలం మహల్ క్రాస్ రోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు దారుణంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న నసీబ్, మోనీషా, మహబూబ్ షాషా, మహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. అనుర్ పాషా అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కొద్దిసేపటి క్రితమే తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ఆర్టీసీ డ్రైవర్ తప్పిదమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిజానికి మహల్ క్రాస్ రోడ్డు అనేక ప్రమాదాలకు నిలయంగా ఉంటుంది. ఏ మాత్రం ఆద మరిచినా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎదురుగా వస్తున్న కారును బస్సు ఢీకొట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో వరుసుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రోడ్డుపై ఉన్న సూచనల బోర్డులను గమనించకుండా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.