Ganja: గంజాయి కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తూ.. గుట్టుచప్పుడు కాకుండా తన నల్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు స్మగ్లర్ షిండే.

Ganja
Ganja suppliers arrested in hyderabad: హైదరాబాద్ శివారులో రూ.21 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు. గంజాయి డాన్ షిండేను అరెస్టు చేశారు. కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న షిండే కోసం.. ఆరు రాష్ట్రాల్లో గాలించారు. 141 సంచుల్లో గంజాయి అమర్చి.. వాటిపైన చెట్ల మొక్కలతో కప్పిపెట్టి సరఫరా చేస్తుండగా.. స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
Read This : Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణ తేదీలు ప్రకటించిన ఈడీ
దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తూ.. గుట్టుచప్పుడు కాకుండా తన నల్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు షిండే. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబై, ఢిల్లీకి సరఫరా చేస్తున్నాడు.
కిలో గంజాయిని రూ.వెయ్యికి కొని లక్షల్లో అమ్ముతున్నాడు. ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. చివరకు అరెస్ట్ చేశారు.
డాన్ షిండేకు సహకరిస్తున్న వారిపైనా నిఘా పెట్టింది ఎన్సీబీ. ముంబై, పుణె, థానే ప్రాంతాలతోపాటు.. మహారాష్ట్ర లోని కొన్ని కాలేజీలకు ఈ ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్టు సమాచారం సేకరించారు.
Read This : Drug Case : ఈడీ విచారణ, హాజరు కానున్న పూరీ జగన్నాథ్
కొన్ని రోజుల క్రితం 4 వేల కిలోల గంజాయి తరలిస్తున్న కేసులో 16 మందిని అరెస్ట్ చేసింది ఎన్సీబీ. వారు ఇచ్చిన సమాచారంతో ఆగస్ట్ 29 2021 ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గంజాయిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. ఈ ఏడాది లో ఇప్పటి వరకు 7, 500 కేజీల గంజాయిని సీజ్ చేసి.. 25 మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.