నగ్నచిత్రాలతో బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్, హైదరాబాద్‌లో దారుణం

  • Published By: naveen ,Published On : August 27, 2020 / 03:53 PM IST
నగ్నచిత్రాలతో బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్, హైదరాబాద్‌లో దారుణం

Updated On : August 27, 2020 / 4:15 PM IST

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. ప్రేమిస్తున్నట్టు నటించి బాలిక నగ్నచిత్రాలు తీసుకున్నాడు. ఆ తర్వాత వాటితో బెదిరించి దారుణానికి ఒడిగట్టాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు.



ప్రేమ పేరుతో బాలికను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి నగ్నచిత్రాలు చిత్రీకరణ:
మహమూద్​గూడకు చెందిన బాలిక(14)ను సీతాఫల్​మండి బీదలబస్తీకి చెందిన శివకుమార్​(23) కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాంగ్​డ్రైవ్​ పేరుతో బాలికను అనేకసార్లు బయటకు తీసుకెళ్లిన శివకుమార్​ ఆమె నగ్నచిత్రాలను తన మొబైల్​ఫోన్​లో చిత్రీకరించాడు. ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఏడాదిగా ఆమెను వేధిస్తున్నాడు.



నూడ్ ఫొటోలు డిలీట్ చేస్తానని నమ్మించి గ్యాంగ్ రేప్:
వారం రోజుల క్రితం శివకుమార్​ తను చెప్పిన చోటుకు వస్తే నగ్నచిత్రాలు డిలీట్​ చేస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన బాలిక ఓయూ పరిధిలోని ఓ పాత భవనానికి వెళ్లింది. అక్కడ శివకుమార్​ అతని ముగ్గురు స్నేహితులు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని సెల్​ఫోన్​లో చిత్రీకరించారు. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
https://10tv.in/young-man-commits-suicide-as-young-lady-cheats-in-the-name-of-love-in-agra/




నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు:
వారి బెదిరింపులకు భయపడిన బాలిక గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్లింది. తర్వాత రోజు అనారోగ్యానికి గురికావడం వల్ల ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. సదరు బాలిక విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పగా రెండ్రోజుల క్రితం వారు చిలకలగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం గమనార్హం. వారిని జువైనల్ హోంకు తరలించారు.



ఆడపిల్లకు రక్షణ లేదా?
ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, ఉరి శిక్షలు విధిస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నమ్మించి నయ వంచనకు పాల్పడుతున్నారు. మాయ మాటలతో బాలికలను మచ్చిక చేసుకుని ఆ తర్వాత అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి నీచులను నడి రోడ్డులో కాల్చి పారేయాలని, స్పాట్ లోనే ఉరి తియ్యాలని, అప్పుడే ఇలాంటి తప్పుడు పనులు చేయాలనే ఆలోచన రాకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు చట్టాలు తెస్తే సరిపోదని వాటిని అమలు చేసినప్పుడే ప్రయోజనం ఉంటుందని మహిళా సంఘాలు అంటున్నాయి. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా బెదిరించినా, బ్లాక్ మెయిల్ చేసినా.. బాధితులు భయపడకుండా ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.