బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా తల్లి వచ్చింది..ఆ తర్వాత బాలిక ఏం చేసింది

  • Published By: madhu ,Published On : March 9, 2020 / 01:43 AM IST
బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా తల్లి వచ్చింది..ఆ తర్వాత బాలిక ఏం చేసింది

Updated On : March 9, 2020 / 1:43 AM IST

బాయ్ ఫ్రెండ్‌తో ఉండగా..తల్లి చూసింది. అంతే ఒక్కసారిగా వణికిపోయింది బాలిక. ఏం చేస్తారో..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయం వెంటాడింది. ఒక్క క్షణం ఆలోచించకుండా..కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకింది. అయితే..ప్రాణాపాయం మాత్రం తప్పింది. తీవ్రగాయాలైన ఈ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వాణిజ్యనగరంగా పేరొందిన ముంబైలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17) ఇంట్లో ఎవరూ లేరు. దీంతో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఏకాంతంగా ఉంది. వారిద్దరూ ఇంట్లో ఉండగా…అకస్మాత్తుగా తల్లి రావడాన్ని బాలిక గమనించింది. తాను దొరికిపోతానన్న భయంతో..మొదటి అంతస్తులో ఉన్న ఇంటి బెడ్ రూం కిటికీలో నుంచి దూకేసింది.

ఈ ఘటనతో షాకింగ్‌ గురైన యువకుడు..అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. తీవ్రగాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఎడమకాలు విరిగినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడు సునీల్ జెండే (20)గా గుర్తించారు. ఇతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

Read More : YesBank సంక్షోభం : PhonePe వాడుతున్న వారికి స్వీట్ న్యూస్