సొంత చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న…దారుణ హత్య

  • Published By: murthy ,Published On : June 5, 2020 / 08:24 AM IST
సొంత చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న…దారుణ హత్య

Updated On : June 5, 2020 / 8:24 AM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడైన అన్న సొంత చెల్లెలిపై అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించిన చెల్లెలు అన్నను హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లా, కోత్వాలి  పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

సతీ మొహల్లాలో ఉండే దీపక్ రాజ్ పుత్(20) అనే యువకుడు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. తల్లితండ్రులు జూన్3 బుధవారం, అమ్ముమ్మ ఇంటికి బేలా పట్టణానికి వెళ్లారు. ఆసమయంలో ఇంట్లో అన్నా చెల్లెళ్లు ఇద్దరే ఉన్నారు.  కామంతో కళ్లు మూసుకుపోయిన దీపత్  తన చెల్లెలి(18)పై అత్యాచారం చేయబోయాడు.  

ఊహించని ఘటనతో బిత్తరపోయిన చెల్లెలు అన్నను ప్రతిఘటించింది.  వదిలిపెట్టమని బతిమలాడింది. అయినా కామంతో కళ్లు మూసుకుపోయిన అన్నదారు చెల్లెలిపా  పశువులా ప్రవర్తించాడు. రెచ్చిపోయి మరింతగా ఆమెను బలాత్కరించబోయాడు. సొంత అన్నయ్యే తనను బలాత్కరించటాన్ని ఊహించని చెల్లెలు.. దిక్కు తోచని పరిస్ధితుల్లో  ఎదురుగా కనపడిన కొడవలి తీసుకుని అన్నపై దాడి చేసి తనను తాను రక్షించుకుంది. 
 

గాయాలపాలైనా దీపక్ చెల్లిని ఏదో రకంగా అనుభవించాలని తీవ్ర ప్రయత్నం చేయబోయాడు. ఎదురుగా ఉన్నరోకలి బండ తీసుకుని తన అన్నను చావ బాదింది. తీవ్ర గాయాలతో దీపక్ రాజ్ రక్తపు మడుగులో పడిపోయాడు.  అనంతరం  బాధితురాలు పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటన వివరించి పోలీసులకు లొంగి పోయింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు  రక్తపు మడుగులో పడిఉన్న దీపక్ ను సెఫాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అతడు కన్నుమూశాడు.ఐపీసీ సెక్షన్ 304 కింద బాలికపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంటికి తిరిగివచ్చిన తల్లితండ్రులు బాలిక చేసిన ఆరోపణలను ఖండించారు. 

Read: కాపురం కూల్చిన సోషల్ మీడియా : ఫేస్ బుక్ ఫ్రెండ్ తో లేచిపోయిన భార్య