Honey Trapped : బీఎస్ఎఫ్ ఉద్యోగిపై పాక్ మహిళా ఏజెంట్ వలపు వల

భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ మహిళా ఏజెంటు వలపు వలలో చిక్కుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ నగరంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి నీలేష్ బలియా పాక్ మహిళా ఏజెంట్ వలలో పడి బీఎస్ఎఫ్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆమెకు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది....

Honey Trapped : బీఎస్ఎఫ్ ఉద్యోగిపై పాక్ మహిళా ఏజెంట్ వలపు వల

Honey Trapped

Honey Trapped : భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ మహిళా ఏజెంటు వలపు వలలో చిక్కుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ నగరంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి నీలేష్ బలియా పాక్ మహిళా ఏజెంట్ వలలో పడి బీఎస్ఎఫ్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆమెకు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. (Gujarat Border Security Force employee)

పాక్ మహిళా ఏజెంటుతో పరిచయం

నీలేష్ బలియా గత ఐదేళ్లుగా భుజ్‌లోని బిఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. అతడిని గుజరాత్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) శుక్రవారం అతడిని పట్టుకుంది. ఈ ఏడాది జనవరి నెలలో నీలేష్ బలియాకు పాకిస్థానీ మహిళా ఏజెంట్ అదితి తివారీతో పరిచయం ఏర్పడింది. (Pakistani woman agent)

పాక్ మహిళకు బీఎస్ఎఫ్ రహస్యాలు

బీఎస్ఎఫ్ భవనాల నిర్మాణం, విద్యుదీకరణ పనులకు సంబంధించిన పత్రాలను నీలేష్ పాక్ మహిళతో పంచుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగిగా నటించిన పాక్ మహిళా ఏజెంటు బలియాను హనీట్రాప్ చేసింది. బలియా సమాచారాన్ని అందించినందుకు పాక్ ఏజెంట్ అతనికి 28,800 రూపాయలను యూపీఐ లావాదేవీల ద్వారా అందుకున్నాడని ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి వెల్లడించారు.

ఏటీఎస్ అరెస్ట్

బలియా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్న ఏటీఎస్ అతని ఫోన్ రికార్డులు, బ్యాంక్ ఖాతా లావాదేవీలను పరిశీలించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బలియాను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుజరాత్ పోలీసులు చెప్పారు.