ప్రేమ..ప్రేమ : వరుడి తండ్రితో వధువు తల్లి పరార్

  • Published By: madhu ,Published On : March 2, 2020 / 07:47 AM IST
ప్రేమ..ప్రేమ : వరుడి తండ్రితో వధువు తల్లి పరార్

Updated On : March 2, 2020 / 7:47 AM IST

ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు..కానీ వారి ప్రేమకు శుభం కార్డు పడలేదు. దీంతో..అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు..పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహం చేసే పిల్లలున్నారు..యాదృచ్చికంగా…ఆ వ్యక్తి కుమారుడు..మహిళ కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. అయితే..పాత ప్రేమ జ్ఞాపకాలు విడిపోయిన జంటల మధ్య చిగురించాయి…అంతే ఇంకేముంది..ఇద్దరూ కలిసి పరార్ అయ్యారు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పరారైందనే వార్త కలకలం రేపింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. 

సూరత్‌కి చెందిన హిమ్మత్ పాండవ్ (46), నవ్ సారికి చెందిన శోభ్న రావల్ (43) ఒకే ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వీరికి వివాహం జరగలేదు. అనివార్య కారణాల వల్ల విడిపోయారు. శోభ్నకు వివాహం జరగడంతో భర్తతో కలిసి నవ్ సారీకి వెళ్లిపోయింది. పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్నారు. పాండవ్ కుమారుడు..శోభ్న కుమార్తెతో వివాహం జరపాలని అనుకున్నారు. ఇరు కుటుంబాలు కలిశాయి.

ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. కానీ..పాండవ్, శోభ్న మధ్య ఇదివరకున్న ప్రేమ మరోసారి చిగురించింది. జనవరి 10వ తేదీన హిమ్మత్, శోభ్నలు ఇంటి నుంచి పారిపోయారు. పెళ్లి కాస్తా పెటాకులు అయ్యింది. దీంతో ఇరు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. రెండు వారాల తర్వాత ఇద్దరూ ఇళ్లకు తిరిగివచ్చారు. ఇక్కడే ట్విస్టు చోటు చేసుకుంది.

శోభ్నను భర్త..ఇంటికి రానియ్యలేదు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మరోసారి 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం మరోసారి హిమ్మత్, శోభ్నలు మరోసారి పరారయ్యారు. ఈసారి మాత్రం కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేయలేదు. వీరు..సూరత్‌లోని ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నట్లు తెలుస్తోంది.