దళిత యువతి నాలుక కోసి gangrape : చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

up gangrape:ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత యువతిపై gangrape జరిగింది. తీవ్రగాయాలకు గురైన బాధితురాలిని ఢిల్లీ హాస్పిటల్ కు తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగానే మరణించింది. రెండు వారాల పాటు పోరాడి సెప్టెంబర్ 14న తుదిశ్వాస విడిచింది. సీరియస్ గా ఉందని.. ఢిల్లీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించినా కాపాడలేకపోయారు.
గ్యాంగ్ రేప్ చేసిన నిందితులని హత్రాస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బాధిత యువతి సందీప్, రాము, లవ్‌కుశ్, రవిలుగా గుర్తుపట్టింది. తల్లితో పాటు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లింది. ఉన్నట్లుండి కనిపించకుండా పోవడంతో అంతా వెదికారు. చివరికి అపస్మారక స్థితిలో ఉన్న ఆమె జాడ తెలిసింది.
ఆమెను కేవలం గ్యాంగ్ రేప్ మాత్రమే కాకుండా చిత్రవధ చేశారు. నాలుకను కోశారు. ఇంకా తీవ్రమైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. నిందితులందరిపైన ఐపీసీ సెక్షన్ 307(హత్యాచారం)కింద కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376డీ(గ్యాంగ్ రేప్)కింద కేసు బుక్ చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపారు.
దళిత యువతి కుటుంబ సభ్యులు దీనికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. స్టేషన్ ఆఫీసర్ ను ఘటన జరిగిన తర్వాత ట్రాన్సఫర్ చేసేశారు. ఘటనపై కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ లీడర్లు ఘటనను ఖండించారు.